బిగ్ బాస్ దివి ‘కర్మస్థలం’ నుంచి పవర్‌ఫుల్ పోస్టర్ విడుదల

Karmasthalam

బిగ్ బాస్ ఫేమ్ దివి వద్త్యా ప్రధాన పాత్రలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రం ‘కర్మస్థలం’ (Karmasthalam). సామ్రాద్ని ఫిల్మ్స్, రాయ్ ఫిల్మ్స్ బ్యానర్లపై హర్ష వర్దన్ షిండే ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రాకీ షెర్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన చిత్ర పోస్టర్, ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

‘కర్మస్థలం’ (Karmasthalam) కొత్త పోస్టర్‌లో దివిని ఒక యోధురాలిగా, అత్యంత ఉగ్రంగా, కదనరంగంలో దూసుకుపోతున్నట్టు చూపించారు. ఆమె చుట్టూ అగ్ని జ్వాలలు, యుద్ధ వాతావరణం కనిపించాయి, ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ వర్క్ ప్రధాన బలాలుగా నిలుస్తాయని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. దివితో పాటు అర్చనా శాస్త్రి, చుంకీ పాండే, అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, కాలకేయ ప్రభాకర్ వంటి ప్రముఖ తారాగణం ఇందులో భాగమైంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇతర కీలక వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించబడతాయి.

Exit mobile version