సూర్య కి చెప్పిన కథతో కార్తి సినిమా

Karthi

తమిళ స్టార్ హీరో అయిన సూర్య ప్రస్తుతం ‘అంజాన్’ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తెలుగులో ‘సికందర్’గా రిలీజ్ కానుంది. అంజాన్ సినిమా ఆడియో ఇటీవలే చెన్నై సత్యం థియేటర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులతో పాటు అభిమానులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మీడియా వారు అడిగిన ప్రశ్నలకి సూర్య ఓపిగ్గా సమాధానం చెప్పాడు.

సూర్య మాట్లాడుతూ ‘లింగుస్వామి నాలుగు స్టొరీలు చెబితే నేను నాలుగవ కథని ఎంచుకున్నాను. ఈ కథలో పెర్ఫార్మన్స్ పరంగా చాలా అవకాశం ఉంది. నేను చేసిన అంజాన్ కాకుండా మిగిలిన కథలు కార్తికి బాగా నచ్చాయి. అందుకే ఆ మూడింటిలోని ఓ కథతో ‘ఎన్ని ఎజు నాల్’ సినిమా తెరకెక్కనుందని’ అన్నాడు.

లింగుస్వామి – కార్తి సినిమాలో సమంత హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. అలాగే కార్తి ప్రస్తుతం కమిట్ అయ్యి ఉన్న సినిమాలు పూర్తి చేయగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది.

Exit mobile version