ఈ నెలలోనే రానున్న కార్తికేయ ఆడియో

Karthikeya-Latest-Poster

‘స్వామి రారా’ సినిమా సక్సెస్ తర్వాత బాగా గ్యాప్ తీసుకొని యంగ్ హీరో నిఖిల్, స్వాతి కలిసి చేస్తున్న సినిమా ‘కార్తికేయ’. థ్రిలర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రొడక్షన్ టీం ఈ సినిమా ఆడియోని ఈ నెలాఖరులోపు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ముందే షూటింగ్ చివరి దశకు చేరుకున్న తరుణంలో తమిళ భాషలో కూడా షూట్ చేయడం మొదలు పెట్టారు.

దాంతో ఈ సినిమాని తెలుగు, తమిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయడం కోసం తెలుగు వెర్షన్ ని కొద్దిగా ఆలస్యం చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా టీజర్ ని ఈ మధ్యే లాంచ్ చేసారు. ఆ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, సిజి షాట్స్ ఎక్కువగా ఉండనున్నాయి. స్వామి రారా సినిమా మంచి సక్సెస్ కావడం వల్ల ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంది. కార్తికేయ ఈ సమ్మర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version