టీజర్ : 90ఎంఎల్- లిక్కర్ లవర్ స్టోరీ…!

90ML2

హీరో కార్తికేయ కొత్త చిత్రం 90ఎంఎల్. నేడు ఈ చిత్ర టీజర్ విడుదల అయ్యింది. జేబులో ఎప్పుడు లిక్కర్ బాటిల్ మైంటైన్ చేసే డ్రింకర్ లవర్ గా కార్తికేయ కనిపించనున్నాడు. ఈ చిత్ర ట్యాగ్ కూడా యాన్ ఆథరైజ్డ్ డ్రింకర్ అని ఉండటం ఆసక్తిరేపుతుంది. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శేఖర్ రెడ్డి ఎర్రా తెరకెక్కిస్తున్నారు.

కావాలని దేవదాసు లాంటి కొడుకుని కన్న తల్లి, 90ఎంఎల్ లేనిదే పూట గడవని యంగ్ ఫెలోల కథే 90ఎంఎల్. టీజర్ తరువాత కూడా కాన్సెప్ట్ పై క్లారిటీ రాలేదు. ఐతే కార్తికేయ విభిన్నంగా ఎదో ట్రై చేస్తున్నాడు అనిమాత్రం అనిపిస్తుంది. కాగా కార్తికేయ సరసన హీరోయిన్ గా నేహా సోలంకి చేస్తుండగా ఆమెను టీజర్ లో రివీల్ చేయలేదు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అలీ, పోసాని,రావు రమేష్, అజయ్, రవి కిషన్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version