ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : 13 సెప్టెంబర్, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : రేణు దేశాయ్, శంకర్ ఇందుచూడన్ తదితరులు
దర్శకత్వం : డి. యమునా కిశోర్
నిర్మాణం : కళ్ళూరి జగదీష్ కుమార్
సంగీతం : డా. జోశ్యభట్ల
ఛాయాగ్రహణం : రాణా
కూర్పు : మీర్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు తీసుకొచ్చిన కొత్త లఘు చిత్రమే ‘కాశీ మజిలీ’. ప్రముఖ నటి రేణు దేశాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ లఘు చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
అప్పుడే కాశీకి వచ్చిన కృపా (రేణు దేశాయ్) తన బ్యాగ్, ఫోన్ పోగొట్టుకున్నా అని పోలీస్ లను ఆశ్రయిస్తుంది. తనకి చాలా ముఖ్యమైన వస్తువులు అందులో ఉన్నాయని ఆమె వస్తుంది. ఇంతలోనే అదే స్టేషన్ కి ఇదేమి వరకే తన బ్యాగ్ కూడా పోయింది అని మళ్ళీ అడగడానికి ఓ యువకుడు కన్నన్ (శంకర్ ఇందుచూడన్) కూడా వస్తాడు. అక్కడ నుంచి బయటికి వచ్చిన కృపా, కన్నన్ లు కలిసి నడిచే ప్రయాణంలో రివీల్ అయ్యే అంశం ఏంటి? కృపా పోగొట్టుకున్నది ఏంటి? తనకి మళ్ళీ కాశీలో దొరికింది ఏంటి? ఆ కన్నన్ ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ లఘు చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ లఘు చిత్రంలో కనిపించే థీమ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఎంచుకున్న థీమ్ కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న ప్రేమ కథా చిత్రం దానికి ఇచ్చిన ముగింపు వంటివి దర్శకుని విజన్ కి తార్కాణం అని చెప్పవచ్చు. దీనిని క్లైమాక్స్ పోర్షన్ లో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ తో ముగించడం బాగుంది.
ఇక రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత మళ్ళీ నటిగా అప్పుడపుడు కనిపిస్తున్నారు. అలానే వచ్చిన ఈ లఘు చిత్రంలో తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారని చెప్పొచ్చు. ఇంట్రెస్టింగ్ గా ఇందులో ఆమెకి చాలా ఎమోషనల్ పెర్ఫామెన్స్ చేసే రోల్ దక్కింది. అందులో ఆమె చాలా బాగా చేశారు. తనతో పాటుగా యువ నటుడు శంకర్ ఇందుచూడన్ కూడా బాగా చేసాడు.
ఇద్దరి మధ్య ట్రాక్ అందులో ఎమోషన్స్ కూడా పర్వాలేదు అనిపిస్తాయి. ఇంకా ఇందులో మ్యూజిక్ మేజర్ ఎసెట్ అని చెప్పొచ్చు. కాశీ నేపథ్యంలో కథనం అక్కడక్కడా మ్యూజిక్ తో ఒక డివోషన్ మూడ్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఇది కూడా ఈ లఘు చిత్రంలో ఆకట్టుకునే అంశం అని చెప్పొచ్చు.
మైనస్ పాయింట్స్:
ఇందులో కొన్ని అంశాలు బాగానే ఉన్నాయి కానీ రేణు దేశాయ్, శంకర్ ల ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ కొంచెం క్లారిటీ లోపించినట్టు అనిపిస్తుంది. దీన్ని ఇంకొంచెం డిటైలింగ్ గా సెట్ చేయాల్సింది. అలాగే సినిమా మొదలైన కొన్ని నిమిషాల వరకు ఆడియోకి, వీడియోకి సింక్ మిస్ అవుతున్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. ఎడిటింగ్ లో దీనిని సరిగా చేయాల్సింది. అలానే కొన్ని సీన్స్ స్లోగా సాగాయి.
సాంకేతిక వర్గం:
ఈ లఘు చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గానే అనిపిస్తాయి. అయితే డాక్టర్ జోశ్యభట్ల ఇచ్చిన సంగీతం చాలా బాగుంది. నేపథ్యానికి తగ్గట్టుగా పాటలు, నేపథ్యగీతం బాగా అందించారు. కెమెరా వర్క్, డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ లో కొన్ని ఎర్రర్స్ ని కరెక్ట్ చేయాల్సింది.
ఇక యమునా కిషోర్ విషయానికి వస్తే.. తన వర్క్ ఈ లఘు చిత్రానికి డీసెంట్ గా ఉంది. మంచి బ్యాక్ డ్రాప్ ఎంచుకొని దానికి తగ్గట్టుగా అందమైన కథనం అల్లుకొని నీట్ ఎండింగ్ అందించారు. కానీ మధ్యలో చిన్న చిన్న లోపాలు కూడా కరెక్ట్ చేసుకోవాల్సింది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘కాశీ మజిలీ’ ఓ డీసెంట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. డైరెక్టర్ విజన్, మ్యూజికల్ టేస్ట్ బ్యూటిఫుల్ ఎమోషన్స్, లవ్ డ్రామా ఇందులో బాగున్నాయి. అలాగే రేణు దేశాయ్ కూడా చాలా బాగా చేశారు. శంకర్ పెర్ఫామెన్స్ కూడా బాగుంది. కానీ చిన్న లోపాలు ఇందులో కాస్త నిరాశ పరుస్తాయి. ఇది పక్కన పెడితే ఈ లఘు చిత్రం మెప్పిస్తుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team
