కత్రినా కూడ తప్పించుకోలేకపోయింది

Katrina Kaif3

కరోనా బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ముంబైలో కేసులు సంఖ్య బాగా పెరగడంతో ప్రభుత్వం ఈ నెల 31 వరకు సినిమా హాళ్లను పూర్తి స్థాయిలో మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో పెద్ద సినిమాలన్నీ వాయిదాపడ్డాయి. ఇక గతేడాది కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్న సమయంలో ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకున్న చాలామంది నటీనటులు ఇప్పుడు కరోనాకు గురవుతున్నారు. వరుసపెట్టి పెద్ద చిన్న అనే తేడా లేకుండా నటీనటులకు కరోనాకు సోకుతోంది.

తాజాగా స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కరోనాకు ఎఫెక్ట్ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా బయటపెట్టారు. పాజిటివ్ అని రిపోర్ట్స్ రావడంతో వెంటనే హోమ్ క్వారంటైన్లోకి వెళుతున్నట్టు తెలిపారు. దీంతో నిన్నటి వరకు ఆమెతో సన్నిహితంగా ఉన్నవారంతా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇప్పటికే అలియా భట్, రన్బీర్ కపూర్, అక్షయ్ కుమార్, విక్కీ కౌశల్, సంజయ్ లీలా భన్సాలీ, భూమి పడ్నేకర్, ఇంకొంతమంది ప్రముఖులు కరోనాకు గురయ్యారు. వీరిలో కొందరు కోలుకోగా, ఇంకొందరు హోమ్ క్వారంటైన్లోనే ఉన్నారు. ఇలా వరుసపెట్టి నటీనటులకు వైరస్ అటాక్ అవుతుండటంతో చిత్రీకరణలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి.

Exit mobile version