క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మాణంలో ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కటాలన్’. ఈ చిత్రం టీజర్‌ను నేడు (జనవరి 16) విడుదల చేయగా, ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. నూతన దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మే 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
‘మార్కో’ వంటి పాన్-ఇండియా హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రం, మలయాళ చిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ ఓవర్సీస్ డీల్స్ దక్కించుకుని సరికొత్త రికార్డులను సృష్టించింది. థాయ్‌లాండ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. దీనికోసం ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ నేతృత్వంలో ఓంగ్-బాక్ సిరీస్‌లో నటించిన ‘పాంగ్’ అనే ఏనుగును కూడా ఈ సినిమాలో ఉపయోగించడం విశేషం.
ఈ చిత్రంలో దుషారా విజయన్ కథానాయికగా నటిస్తుండగా, తెలుగు నటుడు సునీల్, కబీర్ దుహాన్ సింగ్, రాజ్ తిరందాసు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘కాంతార’, ‘మహారాజ’ ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ‘కటాలన్’ చిత్రం తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
