దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమా ‘వారణాసి’. ఇప్పటికే చిత్ర నిర్మాతలు ఏప్రిల్ 7, 2027ను విడుదల తేదీగా ప్రకటించారు. తాజాగా ఈ డేట్ ను ధృవీకరిస్తూ, ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, తాను సెప్టెంబర్ లో ఈ సినిమా నేపథ్య సంగీతంపై వర్క్ ను ప్రారంభించి, జనవరి నాటికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ అప్ డేట్ నిజంగా ఒక శుభవార్తే.
కాగా ప్రియాంక ఈ సినిమాలో మందాకినిగా కనిపిస్తూ ఉండగా.. మహేశ్ రుద్రగా.. శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా ‘వారణాసి’ చిత్రం రూ.1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా, కథా కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. ఇక ఈ సినిమాకి దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.
