
ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో బాహుబలి సినిమా సాంగ్స్ తో ట్రెండ్ అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎంకీరవాణి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించి, ఎన్నో మరపురాని పాటలను మనకు అందించిన ఎంఎం కీరవాణి నిన్నటితో ఇండస్ట్రీలో 25 ఏళ్ళ సక్సెస్ఫుల్ జర్నీని ఫినిష్ చేసుకున్నారు. ఈ విషయంలో ఆయన చాలా హ్యాపీగా ఫీలవ్వడమే కాకుండా ఎన్నో మరపురాని జ్ఞాపకాల సమూహారమే ఈ 25 ఏళ్ళు అంటున్నారు.
‘మౌళి గారి డైరెక్షన్ లో వచ్చిన మనసు మమత సినిమా 1990 జూన్ 29న రిలీజ్ అయ్యింది, రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి 2015 జూలై 10న రిలీజ్ కానుంది. మౌళి నుంచి రాజమౌళి వరకూసాగిన ఈ 25 ఏళ్ళ లాంగ్ జర్నీ ఎన్నో మరపురాని మధురానుభూతులతో గడిచిందని’ ఎంఎం కీరవాణి సోషల్ మీడియాలో తెలిపారు. ప్రస్తుతం కీరవాణి బాహుబలి ఫైనల్ మిక్సింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మిగతా టీం అంతా ఈ సినిమాని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్.
తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మ్యూజిక్ అందించి సినీ పరిశ్రమలో సక్సెస్ఫుల్ గా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎంఎం కీరవాణికి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.