పెంగ్విన్ షూటింగ్ పూర్తిచేసిన కీర్తి

keerthi suresh

మహానటి చిత్రంలో నటనకు గాను జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ లేడీ సెంట్రిక్ చిత్రాలకు ఫస్ట్ ఛాయిస్ గా మారారు. దర్శక నిర్మాతలు ఆమెను అలాంటి కథలతో కలవడం జరుగుతుంది. ప్రస్తుతం కీర్తి ఏకంగా మూడు లేడీ ఓరియెంట్ చిత్రాలలో నటిస్తున్నారు. కాగా టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఆమె ‘పెంగ్విన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. పెంగ్విన్ మూవీలో కీర్తి గర్భవతిగా నటించడం విశేషం.

ఇక దర్శకుడు నగేష్ కుకునూర్ ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కిస్తుండగా అందులో గ్రామీణ ప్రాంతానికి చెందిన షార్ప్ షూటర్ గా కీర్తి చేస్తున్నారు. ఆది పినిశెట్టి హీరోగా చేస్తుండగా, జగపతి బాబు కోచ్ పాత్ర చేస్తున్నారు. మహేష్ కోనేరు నిర్మాతగా, నరేంద్ర నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్ ఇండియా అనే మరో మూవీ చిత్రీకరణ దశలో ఉంది.

Exit mobile version