గోపిచంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రూపొందనున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’లో హీరోయిన్ కోసం ఎప్పటినుండో వెతుకుతున్నా ఇంకా ఎవరు ఓకే కాలేదు. ఈ సినిమా అలిమేలు మంగ పాత్ర మీదే సినిమా నడుస్తోందట. మరి అలాంటి కీలక పాత్రలో.. తేజ మొదటినుండి ఈ పాత్రకు కాజల్ అగర్వాల్ నే అనుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం కాజల్ చేతిలో ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు2’తో పాటు మరో బాలీవుడ్ సినిమా అలాగే విజయ్ మాస్టర్ 2 కూడా ఉంది.
కాగా ఈ సినిమాలన్ని పూర్తి అయ్యాక గాని, కాజల్ మరో సినిమా చేయలేదు. తాను రాసుకున్న అలిమేలు మంగ పాత్రకు న్యాయం చేయాలంటే కచ్చితంగా టాలెంటెడ్ హీరోయినే అయి ఉండాలి. ఈ క్రమంలోనే తేజ,.మొదట హీరోయిన్ కీర్తి సురేష్ నో సాయి పల్లవినో అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఆల్ మోస్ట్ సాయి పల్లవి ఫిక్స్ అనుకునేలోపు, కీర్తి సురేష్ ఈ సినిమా చేయడానికి ఇంట్రస్ట్ గా ఉందట. మరి వీరిద్దరిలో ఎవర్ని తీసుకుంటారో చూడాలి.


