
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఓ పక్క భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కిస్తూనే మరోపక్క వినూత్న కథాంశాలతో కూడిన మీడియమ్ బడ్జెట్ సినిమాలను కూడా నిర్మించడం చూశాం. ఆ క్రమంలోనే ‘కేరింత’ పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ వంటి సెన్సిబుల్ సినిమాలను తీసిన సాయికిరణ్ అడవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కొంతమంది పేరున్న నటులు నటించగా, క్యాస్టింగ్ కాల్ ద్వారా మిగతావారిని ఎంపిక చేశారు.
తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన వివరాలు తెలిశాయి. ఈ వేసవిలోనే సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఇక రేపు (ఏప్రిల్ 10న) సినిమాలో నటించిన నటీనటుల వివరాలు తెలుపుతూ పోస్టర్లు విడుదల చేయనున్నారు. దిల్ రాజు ఎంతో ప్లాన్‌గా రిలీజ్ చేస్తోన్న ఓకే కన్మణి (ఓకే బంగారం) తెలుగు వెర్షన్ విడుదలయ్యాక ‘కేరింత’ సినిమా విడుదల తేదీపై స్పష్టతనివ్వనున్నారు. ఓకే బంగారం ఈ నెల 17న విడుదలవనున్న సంగతి తెలిసిందే!

