కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ డేట్ ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్

kgf2 1

కన్నడ చిత్ర పరిశ్రమ కి అతి పెద్ద చిత్రం గా నిలిచిన కేజీఎఫ్ సినిమా సీక్వెల్ చిత్రీకరణ పూర్తయింది. అయితే ఈ చిత్రం నేటికీ రెండేళ్లు పూర్తి చేసుకోవడం తో ఈ చిత్ర యూనిట్ కేజీఎఫ్ చాప్టర్ 2 కి సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రేక్షకులకు అందించింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను జనవరి 8 వ తేదీన ఉదయం 10:18 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ చిత్రం ఒక సంవత్సరం ఆలస్యంగా వస్తున్నప్పటికీ చాలా స్ట్రాంగ్ గా, పెద్దది గా, డెడ్లి గా వస్తున్నాం అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.

ఈ చిత్రం లో యశ్ నటనకు థియేటర్ల లో అద్దిరిపోయే రెప్సాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం కన్నడ చిత్ర పరిశ్రమ మాత్రమే కాక, అన్ని భాషల వారి మనసులు దోచిన సినిమా గా నిలిచింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణం గా ఈ చిత్రం షూటింగ్ మరియు విడుదల వాయిదా పడింది. ఈ చిత్రం లో యశ్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయిక గా నటిస్తోంది. ఈ చిత్రం లో సంజయ్ దత్ అధీర పాత్రలో నటిస్తున్నారు. రవీనా టాండన్, రావు రమేష్ లతో పాటుగా పలువురు ప్రముఖుల ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. హాంబల్ ఫిల్మ్స్ పై తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.

Exit mobile version