ఇప్పుడు సంక్రాంతి సీజన్ కావడంతో అన్ని సినీ ఇండస్ట్రీలలో కూడా సినిమాల సందడి మళ్ళీ మొదలయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఈ సీజన్లోనే ఈసారి సినిమాలతో పాటుగా పలు బడా చిత్రాల టీజర్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి వాటిలో సాలిడ్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. ఇక టీజర్ విషయం పక్కన పెడితే ఈ చిత్రంపై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర దర్శకుడు హీరో యష్ ను రాకీ భాయ్ అనే రోల్ లో ఎంత పవర్ ఫుల్ గా చూపించారో చాప్టర్ 1 లో అంతా రుచి చూసారు.
కానీ ఈసారి చాప్టర్ 2 ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి స్టోరీని మరింత ఇంట్రెస్టింగ్ గా నీల్ తీర్చిదిద్దారని ఆ మధ్య వినిపించింది. అయితే మేకర్స్ ఇప్పుడు చేస్తున్న ప్రమోషన్స్ లో భాగంగా కేజీయఫ్ టైమ్స్ అనే పత్రిక టైప్ లో కొన్ని ఆడిషన్స్ విడుదల చేస్తున్నారు. వినూత్నంగా స్టార్ట్ చేసిన ఈ ప్రమోషన్స్ లో లేటెస్ట్ ఆడిషన్ ను రిలీజ్ చేశారు. మరి దీనితో చాప్టర్ 2 లో రాకీ భాయ్ అంతిమ లక్ష్యం ఏంటి అన్న వాటిపై హింట్ ఇస్తున్నారు.
రాకీ తన ప్రేమను వదులుకుంటాడా అధికారాన్ని వదులుకుంటాడా అన్న ప్రశ్నలతో మంచి ఇంట్రెస్టింగ్ గా ఇది ఉంది. రాకీ అధికారం అలాగే తన బ్రాండ్ కోసం ఎంత దూరం అయినా వెళ్లే పర్సనాలిటీ మరి దాని కోసం ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని వదులుకుంటాడా లేదా అన్నది వచ్చే స్టోరీలో మైన్ పాయింట్ అని చెప్పొచ్చు. మరి దీనిపైనే వీరు కూడా హింట్ ఇచ్చారు. మరి సినిమాలో ఇలాంటి పాయింట్ ఉంటుందా లేదా అన్నది కూడా చూడాలి.
