ప్రస్తుతం మన దక్షిణాది నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. మైండ్ బ్లోయింగ్ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి ఇంకొన్ని రోజుల్లో మోస్ట్ అవైటెడ్ టీజర్ రానుంది. దీనితో ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో కూడా దీని కోసం హాట్ టాపిక్ నడుస్తుంది.
ఇక ఈ టీజర్ వస్తున్న నేపథ్యంలో మేకర్స్ కొన్ని ఆసక్తికర పోస్టర్స్ ను విడుదల చెయ్యడం మొదలు పెట్టారు. లేటెస్ట్ గా ఈ చిత్రంలో కీలక పాత్ర అయినటువంటి రమికా సేన్ పోస్టర్ ను విడుదల చేశారు. మరి ఈ పోస్టర్ ప్యాట్రన్ లోనే పవర్ ఫుల్ రోల్ రాకీ భాయ్ అలాగే సంజయ్ దత్ చేసిన అధీరా లుక్స్ కూడా వదిలి టీజర్ కు ముందు మరింత హైప్ ను తెచ్చే ప్రమోషన్స్ తో అలెర్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ టీజర్ వచ్చే లోపు ఎలాంటి అప్డేట్స్ ను మేకర్స్ వదులుతారో చూడాలి.
