హీరో కార్తీ నటించిన తాజా చిత్రం ఖైదీ క్రిటిక్స్ ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల ఆదరణ కూడా దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఖైదీ చిత్రం మొదటి వారం పూర్తయ్యేనాటికి మంచి వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఖైదీ వరల్డ్ వైడ్ గా 50కోట్ల వసూళ్లు సాధించినట్టు సమాచారం. మొదట్లో నెమ్మదిగా ప్రారంభమైన ఈ చిత్ర వసూళ్లు తరువాత పుంజుకోవడం చిత్ర విజయానికి నిదర్శనం. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈ చిత్ర వసూళ్లకు కీలకంగా పనిచేస్తుంది. ఇక తెలుగులో కూడా ఖైదీ మెరుగైన వసూళ్లు రాబడుతుంది.
తెలుగులో మంచి మార్కెట్ ఉన్న కార్తీ ఖైదీ చిత్రంతో మరో మారు హిట్ అందుకున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ ప్రయోగాత్మక చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఎటువంటి కమర్షియల్ అంశాలు లేకుండా రియలిస్టిక్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందించారు. ఇక సూపర్ స్టార్ మహేష్ ఖైదీ చిత్రంపై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించడం గమనార్హం.
