కార్తీ ‘ఖైదీ’ మూవీ రెండవ వారం కూడా సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తోంది. వారాంతపు దినాలలో ఖైదీ ఇంకా మెరుగైన వసూళ్లను రాబడుతుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం నేడు ఖైదీ చిత్రం తెలుగులో 10కోట్ల వసూళ్లను దాటి వేస్తుందని సమాచారం. తెలుగులో ఖైదీ హక్కులను అమ్మిన ధరల రీత్యా ఇప్పటికే ఈ చిత్రం లాభాల పట్టిందని తెలుస్తుంది. తెలుగులో చెప్పుకొదగ్గ పెద్ద చిత్రాల విడుదల లేకపోవడం తో ఈ మూవీ అత్యంత ఆదరణ దక్కించుకుంటుంది. ఈ వారం కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద చిత్రాలేవీ విడుదల కావడం లేదు.
తరుణ్ భాస్కర్ హీరోగా, విజయ్ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా మూవీ మాత్రమే ఖైదీ కి ఎంతో కొంత పోటీ ఇస్తుంది. తెలుగులో సరైన విజయం లేక సతమమవుతున్న కార్తీకి ఖైదీ రూపంలో మంచి హిట్ లభించింది. విలక్షణ దర్శకుడు కార్తీక్ కనకరాజ్ ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 50కోట్ల వసూళ్లను అధిగమించింది. మీడియం బడ్జెట్ తో తెరకెక్కిన ఖైదీ చిత్రం అందరికీ లాభాలు పంచడం ఖాయం.
