వీక్ డేస్‌లో కూడా ‘ఖైదీ’ పెర్ఫార్మెన్స్ బాగుంది

khaidi2

కంటెంట్ బాగుంటే అది డబ్బింగ్ సినిమా అయినా అందులో హీరోయిన్, పాటలు, కామెడీ లేకపోయినా సరే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి ‘ఖైదీ’ చిత్రమే సాక్ష్యం. ఈ సినిమాతో కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలకు దారులు తెరుచుకున్నాయని అనుకోవచ్చు. మొదటి రోజు రూ.30 లక్షలు, రెండవ రోజు రూ.90 లక్షలు వసూలు చేసి అత్యధికంగా ఆదివారం రూ.1.30 కోట్లు షేర్ రాబట్టిన ఈ చిత్రం నాల్గవ రోజు కూడా అదే విధంగా పెర్ఫార్మ్ చేసింది.

సోమవారం వర్కింగ్ డే అయినా కూడా రూ.97 లక్షల షేర్ అందుకుంది. దీంతో సినిమా నాలుగు రోజులకు కలిపి రూ.3.4 కోట్ల షేర్ ఖాతాలో వేసుకుంది. సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఇంకో కోటి రూపాయల షేర్ రావాలి. సినిమాపై ప్రేక్షకులు చూపుతున్న ఆసక్తి దృష్ట్యా ఇంకో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఖాయంగా కనిపిస్తోంది. కార్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి త్వరలో సీక్వెల్ కూడా రానుంది.

Exit mobile version