‘మామ్’ సీక్వెల్‌లో శ్రీదేవి కూతురు.. తల్లి మరణంపై కూతురి న్యాయపోరాటం!

Khushi-Kapoor

లెజెండరీ హీరోయిన్ శ్రీదేవి నటించిన ‘మామ్’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్‌లో దిగ్గజ నటి శ్రీదేవి ఆ సినిమాలో ఇచ్చిన బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

అయితే, గతంలో మామ్ సీక్వెల్ చిత్రంలో శ్రీదేవి కూతురు ఖుషి కపూర్ నటిస్తుందనే వార్త బిటౌన్‌లో చక్కర్లు కొట్టింది. కానీ, ఇప్పుడు ఇది నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది. ‘మామ్’ సీక్వెల్‌గా రాబోతున్న ‘మామ్ 2’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు గిరీష్ కోహ్లీ సిద్ధమవుతున్నారట. ఈ సినిమాలో ఖుషి కపూర్ లీడ్ రోల్‌లో నటించబోతుందట. అయితే, ‘మామ్’ చిత్రంలో శ్రీదేవి చేసిన పాత్రలో ఖుషి కనిపించదట.

తన తల్లి మరణంతో న్యాయపోరాటం చేసే ఓ యువతి పాత్రలో ఖుషీ కపూర్ కనిపిస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో కరిష్మా తన్నా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బోనీ కపూర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. మరి ఈ ‘మామ్ 2’ చిత్రంతో ఖుషీ కపూర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Exit mobile version