నేడే కడుపుబ్బా నవ్వుకునే ‘కిక్ 2’ న్యూ ట్రైలర్ రిలీజ్

kick-2
మాస్ మహారాజ్ రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన కిక్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ‘కిక్ 2’ సినిమా ఆగష్టు 21న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించాడు. రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేయడంతో రెండు వారాల ముందు నుంచే ఈ చిత్ర టీం మూవీ ప్రమోషన్స్ ని జోరుగా చేస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు చాలా గ్రాండ్ గా కిక్ 2 ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయనున్నారు.

తాజాగా మాకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్లాటినం డిస్క్ వేడుక కానుకగా ఈ రోజు రాత్రి 8 గంటలకి ఓ సూపర్బ్ కామెడీ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ లో రవితేజ – బ్రహ్మానందం కామెడీ సీన్స్ కూడా, ఉంటాయని అవి ఆడియన్స్ ని తెగ నవ్విస్తాయని ఈ చిత్ర టీం తెలిపింది. అలాగే ఈ సినిమాలో కూడా కిక్ లో లానే కామెడీ అనేది బాగా వర్కౌట్ అవుతుందని సమాచారం. కిక్ సినిమాలోని రవితేజ – ఇలియానాల కుమారుడు కథే ఈ ‘కిక్ 2’. మొదటి పార్ట్ లో తన కిక్ ని వెతుక్కుంటూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన రవితేజ ఇందులో తన కంఫర్ట్ లెవల్స్ ఏమేమి చేసాడు అన్న కాన్సెప్ట్ తో తెలుగు ప్రేక్షకులను నవ్వించడానికి సిద్దమయ్యాడు. కిక్ సినిమాకి సీక్వెల్ అయిన కిక్ 2 కి కూడా వక్కంతం వంశీ కథని అందించాడు. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version