
మాస్ మహారాజ రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కిక్’ సినిమాకి కొనసాగింపుగా వస్తున్న సినిమా ‘కిక్ 2’. అన్ని కార్యక్రమాలను రిలీజ్ చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 21న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. హాలీవుడ్ మరియు బాలీవుడ్ లో కొన్ని సినిమాలకి స్పెషల్ మొబైల్ యాప్స్ మరియు గేమ్స్ ని రూపొందించి రిలీజ్ చేస్తుంటారు, కానీ టాలీవుడ్ లో అలాంటివి తక్కువనే చెప్పాలి. తాజాగా కిక్ 2 చిత్ర టీం మాత్రం ఓ స్పెషల్ యాప్ ని తయారు చేసింది. ఈ యాప్ ద్వారా మీ మొబైల్ లోనే ఈ సినిమాకి సంబందించిన స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్, వీడియోస్ లాంటివి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం యాప్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఈ చిత్ర డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ స్పెషల్ యాప్ ని లాంచ్ చేస్తాడు. జూలై 30వ తేదీ హైదరాబాద్ లోని రేడియో సిటీ 91.1 ఎఫ్ఎంలో సురేందర్ రెడ్డి కిక్ 2 యాప్ లాంచ్ చేయనున్నాడు. కిక్ సినిమాలోని రవితేజ – ఇలియానా వారుసుడి కథగా ఈ ‘కిక్ 2’ సినిమాని తెరకెక్కించారు. రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.