
మాస్ మహారాజ్ రవితేజను డిఫరెంట్‌గా పరిచయం చేసి అతడి కెరీర్లో మరిచిపోలేని సినిమాగా నిలిచింది ‘కిక్’. ఇప్పుడా సినిమాకు సీక్వెల్‌గా ‘కిక్ 2’ రూపొందిన విషయం తెలిసిందే! ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, చివరకు ఆగష్టు 21కి ఫిక్స్ అయింది. సినిమా విడుదలకు ఇంకా వారం రోజులే ఉండడంతో ‘కిక్ 2’ టీమ్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే నిన్న ప్లాటినమ్ డిస్క్ వేడుక కూడా నిర్వహించి సినిమాను ప్రేక్షకులకు చేర్చే ప్రయత్నం చేశారు.
ఇక అప్పుడెప్పుడో ఆడియో రిలీజ్ అప్పుడు విడుదలైన ట్రైలర్ అందరూ ఇప్పటికే చూసేసి ఉన్న నేపథ్యంలో, నిన్న ఒక కొత్త ట్రైలర్‌ను విడుదల చేసి సినిమాపై మళ్ళీ ఆసక్తిరేకెత్తించేలా చేయగలిగారు. ఈ ట్రైలర్లో రవితేజ తనదైన ఈజ్‌తో చెప్పే డైలాగ్స్ అభిమానులను విపరీతంగా అలరిస్తున్నాయి. బ్రహ్మనందం, రవితేజల కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ ఏ రేంజ్లో ఉండనున్నాయనే విషయాన్ని ట్రైలర్ రుచి చూపించింది. దర్శకుడు సురేందర్ రెడ్డి తన స్టైల్లో ‘కిక్’ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా చేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ‘కిక్ 2’ రవితేజ సరసన హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు.
ట్రైలర్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

