‘కింగ్డమ్’ బాయ్స్ మీట్.. అనిరుద్ కి విజయ్ సర్ప్రైజ్!

kingdom 1

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కింగ్డమ్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుంటూ ఆల్రెడీ ప్రమోషన్స్ పై కూడా దృష్టి పెట్టేసారు. ఆల్రెడీ సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చిన సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

అయితే లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ కింగ్డమ్ బాయ్స్ మీట్ అంటూ అనిరుద్ సహా దర్శకుడు గౌతమ్ లతో కలిసి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని రివీల్ చేసాడు. మరి ఇందులో తన రౌడీ బ్రాండ్ నుంచి అనిరుద్ కి స్పెషల్ బట్టలు సర్ప్రైజింగ్ గా అందించి తాను కూడా హుకుం టీ షర్ట్ ధరించాడు. అలాగే ఇది ఎపిసోడ్ 1 అన్నట్టుగా కూడా తెలిపాడు. అంటే ఇక నుంచి అనిరుద్ తో మరిన్ని వీడియోస్ రానున్నాయని చెప్పొచ్చు. ఇలా ఫ్యాన్స్ లో ఈ ఇంట్రెస్టింగ్ కంటెంట్ వైరల్ గా మారింది.

Exit mobile version