‘ఉస్తాద్ భగత్ సింగ్’ నెక్స్ట్ సాంగ్ పై లేటెస్ట్ అప్డేట్!

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఆల్రెడీ రెండు సాంగ్స్ వచ్చి అలరించాయి. ఇక ఈ సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్ మాత్రం అదిరిపోతుంది అని హరీష్ శంకర్ తెలిపారు. ఈ సినిమాలో కేవలం 4 పాటలు మాత్రమే ఉన్నాయని తెలిపారు.

మొదట వచ్చిన రెండు సాంగ్స్ కాకుండా ఇప్పుడు రానున్న నెక్స్ట్ సాంగ్ భారీ లెవెల్లో ఉంటుందని తాను తెలిపారు. అయితే ఈ సాంగ్ పై మార్చ్ 4న అప్డేట్ ఉంటుంది అన్నట్టు తెలిపారు. కానీ ప్రస్తుతానికి అయితే మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. కానీ చాలా గ్రాండ్ గా ఈ సాంగ్ ఉంటుందని తాను ప్రామిస్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మార్చ్ 26న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Exit mobile version