యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘దిల్ రూబా’ మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు విశ్వ కరుణ్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో అందాల భామ రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. ముఖ్యంగా యూత్‌కు ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ సినిమాలో ప్రేమికులను చూపించే విధానం ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ సినిమాకు సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తుండగా రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
