నారా రోహిత్ సరసన ‘కిస్’ హీరోయిన్..

nararohith
అడవి శేష్ సరసన ‘కిస్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియా బెనర్జీ తెలుగులో మరో అవకాశం సొంతం చేసుకుంది. విజయ్ లింగమనేని దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా తెరకేక్కబోయే కొత్త సినిమాలో ప్రియా బెనర్జీని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రియా బెనర్జీ ట్రెడిషనల్ అమ్మాయిగా నటిస్తుంది. ఈ సినిమాలో అవకాశం రావడం పట్ల ప్రియా సంతోషం వ్యక్తం చేసింది. ఇంకా ఈ సినిమా టైటిల్ ఖరారు చేయలేదు.

‘కిస్’ తర్వాత సందీప్ కిషన్ ‘జోరు’లో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా ప్రియా బెనర్జీ నటించింది. ‘జోరు’ చిత్రీకరణ సమయంలో ఆమె నటన నచ్చడంతో నారా రోహిత్ సినిమా దర్శకనిర్మాతలకు రికమండ్ చేశారు. ‘జోరు’ త్వరలో విడుదల కానుంది. ఇవి కాకుండా తమిళం, హిందీలలో ఒక్కొక్క సినిమాలో నటిస్తుంది.

Exit mobile version