
రైటర్ గానే కాకున్దామోదటి రెండు సినిమాలతో డైరెక్టర్ గా కూడా తెలుగు మనసులను గెలుగుకున్న డైరెక్టర్ కొరటాల శివ. సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘శ్రీమంతుడు’. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తూ మొదటి 5 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరికొన్ని సీన్స్ యాడ్ చేయనున్నారని రెండు రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ చిత్ర డైరెక్టర్ ఆ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసాడు.
శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ రోజు ఈ చిత్ర టీం సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. అక్కడ కొరటాల శివ మాట్లాడుతూ ‘ శ్రీమంతుడులో యాడ్ చెయ్యాలనుకునే సీన్స్ గురించి ఇప్పుడే ఏమీ అనుకోలేదు. చాలా మంది అడుగుతున్నారు. అందుకే ముందు నేను వెళ్లి ఎడిటర్ తో కూర్చొని ఓ సారి డిస్కస్ చేసి ఆ తర్వాత డిసైడ్ అవుతాం. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని’ తెలిపాడు. కొరటాల శివ మిర్చి టైములో కూడా రిలీజ్ అయిన కొద్ది రోజులకి సూపర్బ్ అనిపించుకున్న రెయిన్ ఫైట్ ని యాడ్ చేసాడు. ఆ ఫైట్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అదే బాటలోనే ఈ సినిమాలో కూడా కొన్ని సీన్స్ యాడ్ చేస్తే సినిమాకి మరింత హైప్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
జగపతి బాబు మహేష్ బాబుకి తండ్రిగా కనిపించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.