ప్రముఖ తమిళ హాస్య నటుడు వడివేలు ఫై తమిళనాడు ఫిలిం ఛాంబర్ నిషేధం విధించింది. వివరాల్లోకి వెళితే వడివేలు ప్రస్తుతం ‘హింసై అరసన్ 24వ పులకేశి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కు సకాలంలో రాకుండా ఇబ్బంది పెడుతున్నాడట వడివేలు. అంతటి ఆగకుండా మద్యం తాగి షూటింగ్ కు ఇబ్బంది కలిగించడంతో ఆయన్ను చిత్ర యూనిట్ మందలించిందట. దాంతో అలిగి షూటింగ్ కు రానని చెప్పడంతో వడివేలుపై చర్యలు తీసుకోవాలని చిత్ర నిర్మాతలు ఫిలిం ఛాంబర్ ను ఆశ్రయించారట.
దాంతో 9కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించు లేకుంటే నిన్ను బ్యాన్ చేస్తామని హెచ్చరించినా పట్టించుకోలేదువడివేలు. దాంతో ఇప్పుడు ఆయనఫై నిషేధం విధించింది. ఇక ఒకప్పుడు స్టార్ హీరోల సైతం ఆయన డేట్స్ కోసం ఎదురుచూసే రేంజ్ కు చేరుకున్న ఈకమీడియన్ కెరీర్ పిక్ స్టేజ్ లో వున్నపుడు రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ సక్సెస్ కాలేకపోయాడు. దాంతో మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాడు.
