మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల చిత్రం త్వరలో సెట్స్ మీదికి వెళ్లనున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే సినిమాలో చిరును కొత్తగా, స్టైలిష్ లుక్ లో చూపించాలని డిసైడ్ అయ్యారు కొరటాల. ఆ లుక్ కోసం షూటింగ్ సైతం పక్కనబెట్టి ఎదురుచూశారు. ఇప్పటికే పలుసార్లు లుక్ టెస్ట్ చేశారు.
ఎట్టకేలకు ఫైనల్ లుక్ టెస్ట్ ద్వారా కొరటాల చిరుకు తాను అనుకున్న లుక్ వచ్చిందని నిర్ణయించుకున్నారట. అంతేకాదు ఆ లుక్ పట్ల ఆయన చాలా సంతృప్తిగా ఉన్నారట. దీంతో రెగ్యులర్ షూట్ మొడలుపెట్టడానికి రెడీ అయ్యారు. జనవరి ఆరంభంలో చిత్రీకరణ మొదలుకానుంది. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
