క్లాస్ డైరెక్టర్ కొరటాల శివ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయనున్నాడని గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా మరో గాసిప్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ తో సినిమా పూర్తి అయిన తర్వాత, కొరటాల చరణ్ తోనే సినిమాని ప్లాన్ చేస్తున్నాడని.. 2023 స్టార్టింగ్ లో ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలోనే చరణ్ కి కొరటాల ఓ కథ చెప్పాడని, ఆ కథనే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది.
చరణ్ – కొరటాల కాంబినేషన్ అంటే.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది. కాగా కొరటాల ఇండ్రస్ట్రీలో ఉన్న ప్రతి స్టార్ హీరోతోనూ ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అందుకే, జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా అనంతరం, కొరటాల చరణ్ తోనే సినిమా చేస్తాడట. ఆ తర్వాత అల్లు అర్జున్ తో కూడా ఓ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి హీరోల ఇమేజ్ ను బట్టి కథలు రాసే కొరటాల, చరణ్ కోసం, అలాగే బన్నీ కోసం ఎలాంటి కథ రాశాడో చూడాలి.