‘రామాయణ’ సంచలన రిలీజ్.. ఏకంగా 50 వేలకి పైగా స్క్రీన్లలో!?

ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ వ్యాప్త రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ చిత్రాల్లో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన భారీ చిత్రం ‘రామాయణ’ కూడా ఒకటి. దర్శకుడు నితీష్ తివారి, రణబీర్ కపూర్, సాయి పల్లవి అలాగే యష్ ల కలయికలో చేసిన ఈ హిస్టారికల్ సినిమా ఇప్పుడిప్పుడే వరల్డ్ వైడ్ ఆడియెన్స్ దగ్గరకి వెళుతుంది.

అయితే ఈ సినిమాని వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ముందుకు ఒక సంచలన రిలీజ్ తో తీసుకువస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీని ప్రకారం రామాయణ ఏకంగా 50 వేలకి పైగా స్క్రీన్స్ లో విడుదల కానున్నట్టుగా టాక్ వైరల్ గా మారింది. ఇటీవల వచ్చిన ఒడిస్సీ సినిమానే 25 వేలకి పైగా స్క్రీన్స్ లో విడుదల అయ్యింది.

అయితే ఇందులో చైనా విడుదల లేదు. కానీ రామాయణ సినిమాకి అవతార్ 2 రేంజ్ విడుదల దక్కడం అనేది చిన్న విషయం కాదు. ఒకవేళ ఇదే టాక్ నిజం అయితే ఇండియన్ సినిమా నుంచి అత్యధిక స్క్రీన్స్ లో విడుదల అయ్యిన మొదటి సినిమాగా నిలుస్తుంది. అయితే దీనికి కారణం ముఖ్యంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సోనీ పిక్చర్స్ అన్నట్టుగా వినిపిస్తుంది.

వీరి సారథ్యంలో ఓవర్సీస్ మార్కెట్ లో రామాయణ ఊహించని రిలీజ్ కి రాబోతుంది అని టాక్. మరి ఇన్ని స్క్రీన్స్ లో రిలీజ్ సరే కానీ ఆడియెన్స్ కూడా ఆదరణ చూపిస్తే ఈ చిత్రానికి చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తాయి. సో వీటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version