‘కంచె’ సినిమా కథ ఎక్కడ పుట్టిందంటే..!

‘కంచె’ సినిమా కథ ఎక్కడ పుట్టిందంటే..!

Published on Sep 15, 2015 12:07 PM IST

krish
‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందేజగద్గురుమ్’ ఇలా తాను తీసే ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక బలమైన కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలని తపించే దర్శకుడు క్రిష్. తాజాగా ఆయన వరుణ్ తేజ్ హీరోగా రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యానికి ఒక ప్రేమకథను ముడిపెట్టి ‘కంచె’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, అక్టోబర్ 2న పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ట్రైలర్, కాన్సెప్ట్‌తో అందరినీ కట్టిపడేసిన ఈ సినిమా, పై భారీ అంచనాలే ఉన్నాయి.

సెప్టెంబర్ 17న ఈ సినిమా ఆడియో రిలీజ్‌ను ప్లాన్ చేశారు. ఇక ఆడియో రిలీజ్ ప్లాన్స్, సినిమా విశేషాలు తెలియజేస్తూ దర్శకుడు క్రిష్.. కంచె కథ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. వైజాగ్‌లోని ఓ మ్యూజియంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో వైజాగ్‌పై కూడా ఒక దాడి జరిగిందని, ఆ వివరాలను చూసినప్పుడు కొత్తగా అనిపించిందని తెలిపారు. మళ్ళీ ఒకసారి తమిళ వేదం రీమేక్ షూటింగ్ అప్పుడు కరైకుడిలోని ఓ మ్యూజియమ్ ద్వారా రెండో ప్రపంచ యుద్ధంలో మన సైనికులు కూడా పాలు పంచుకున్న విషయం తనకు మరింత కొత్తగా కనిపించిందని, ఈ నేపథ్యానికి ఓ ప్రేమకథను జోడించి తాను ఈ సినిమా చేశానని క్రిష్ స్పష్టం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు