
‘గోవిందుడు అందరివాడేలే’ విజయం తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న కృష్ణవంశి, తన తదుపరి చిత్రానికి స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా రూపొందిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం కృష్ణవంశి దర్శకత్వం వహిచబోయే ఈ తాజా చిత్రంలో కొత్త నటీనటులకు అవకాశం ఇస్తున్నారు. హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్తవారు లేదా అప్ కమింగ్ స్టార్స్ నటిస్తారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు. తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కనుంది. తన శైలిలో సాగిపోయే కథ, కథనాలతో క్రియేటివ్ మార్క్ ఎంటర్టైనర్ రూపొందించడానికి కృష్ణవంశి రెడీ అయ్యారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.