‘రంగమార్తాండ’ ప్లాన్ వర్కౌట్ అవుతుందా ?

ranga

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జులై ఫస్ట్ వీక్ నుండి ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు కృష్ణవంశీ. సినిమాలో కొంత భాగం మాత్రమే షూటింగ్ కి బ్యాలెన్స్ ఉందని.. ఆ భాగం షూట్ పూర్తి చేస్తే.. సినిమా టాకీ పార్ట్ పూర్తి అవుతుందని తెలుస్తోంది.

పైగా ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. కృష్ణవంశీ హిట్ కోసం చాలా ప్లాన్డ్ గా ఈ రీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు. మరి చూడాలి కృష్ణవంశీ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది.

అన్నిటికీ మించి కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అనసూయ పాత్ర కథలో కీలకంగా ఉంటుందట. నాటకాలు వేసే కళాకారిణిగా ఆమె నటిస్తోందట. ఇక ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు.

Exit mobile version