
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి తెలుగు తెరకు పరిచయమైన సుధీర్ బాబు, అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్యే ‘మోసగాళ్ళకు మోసగాడు’ అంటూ క్రైమ్ కామెడీతో మన ముందుకొచ్చిన సుధీర్, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
సుధీర్ బాబు, నందిత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు చంద్రు దర్శకుడు కాగా, రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో సుధీర్ కనిపించనున్నాడు. ఇప్పటివరకూ సినిమాకు సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూసిన సినిమా యూనిట్ జూన్ 19వ తేదీని విడుదల తేదీగా నిర్ణయించారు. సుధీర్ బాబు, నందితల నటన ఈ ప్రేమకథకు మేజర్ హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది.