క్రిష్ బాలీవుడ్ సినిమాకు స్టడీ కెలెక్షన్స్!

krish
‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’ లాంటి సినిమాలతో మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్న క్రిష్.. గబ్బర్ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మించారు. శృతి హాసన్, కరీనా కపూర్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మేడే కానుకగా మే 1న విడుదలైంది. గతంలో తమిళంలో నిర్మించబడి సూపర్ హిట్‌గా నిలిచిన మురుగదాస్ సినిమా ‘రమణ’కి రీమేకే ఈ గబ్బర్. ఇక ‘రమణ’ సినిమా, తెలుగులో ‘ఠాగూర్’ పేరుతో చిరంజీవి హీరోగా రీమేక్ అయి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇక విడుదలతోనే మంచి పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ పరంగానూ మంచి వసూళ్ళను రాబట్టుకుంటోంది. 2015లో బాలీవుడ్‌లో విడుదలైన సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా గబ్బర్ నిలిచింది. మొదటి వారం మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా రెండో వారంతంలోనూ మంచి కలెక్షన్లను రాబడుతోంది. రెండో వారం థియేటర్లు తగ్గినా కలెక్షన్లు మాత్రం స్టడీగానే ఉన్నాయి. రెండో వారాంతం వరకూ ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో రూ. 72కోట్లు కొల్లగొట్టింది. మూడో వారాంతం వరకూ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఈ సినిమా వంద కోట్ల మార్క్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version