మెగాస్టార్ సినిమాలో బేబమ్మ? అసలు నిజం ఇదే!

Chiranjeevi and krithi

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సెన్సేషనల్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత నెక్ట్స్ రానున్న సినిమాలపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బాబీ కొల్లితో తన కెరీర్ 158వ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి చిరంజీవి కూతురి పాత్రలో నటిస్తుంది అన్నట్టు కొన్ని రూమర్స్ తాజాగా స్టార్ట్ అయ్యాయి.

మరి ఈ రూమర్స్ పై ఫైనల్ గా ఓ క్లారిటీ వినిపిస్తోంది. ఇందులో ఎలాంటి నిజం లేదట. బేబమ్మ ఈ సినిమాలో ఉందనే వార్తలు నిజం కాదు అని టాక్. సో వీటిలో ఎలాంటి నిజం లేదనే చెప్పాలి. ఇక ఈ సినిమాను బాబీ ఓ సాలిడ్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తుండగా కన్నడ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్ వారు నిర్మాణం అందిస్తున్నారు.

Exit mobile version