‘దృశ్యం’తో పరిచయడం కావడం నా అదృష్టం – కృతిక

kruthika
ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘దృశ్యం’ సినిమాతో పరిచయం అవుతున్న బెంగుళూరు భామ కృతిక. స్వతహాగా క్లాసికల్ డాన్సర్ అయిన కృతిక, ‘దృశ్యం’లో వెంకటేష్ పెద్ద కుమార్తె పాత్రలో కృతిక నటించింది. తన తోలి విడుదల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తుంది.

ఈ సందర్భంగా కృతిక మాట్లాడుతూ.. ‘తోలి సినిమాలోనే వెంకటేష్. మీనా వంటి సీనియర్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఎలా నటించాలో నాకు టిప్స్ చెప్పేవారు. మేమంతా షూటింగ్ టైంలో ఫ్యామిలీలా కలసిపోయాం. షూటింగ్ జరిగినన్ని రోజులూ చాలా ఎంజాయ్ చేశాను. తెలుగులో ఇంత కంటే మంచి అవకాశం వస్తుందని అనుకోవడం లేదు. ‘దృశ్యం’తో పరిచయడం కావడం నా అదృష్టం’ అని అంటుంది.

అందంతో పాటు అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలలో నటించాలని ఉందని చెప్పింది.

Exit mobile version