అనసూయ థ్రిల్లర్ సినిమాకి టైటిల్ దొరికేసింది.!

anusuya
‘జబర్దస్త్’ అనే కామెడీ షో ఎంత ఫేమస్ అయ్యిందో అంతకన్నా ఎక్కువగా ఆ షో కి యాంకర్ గా చేసిన అనసూయ ఫేమస్ అయ్యింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్స్ లో ఒకరుగా చెలామణీ అవుతున్న అనసూయకి గతంలో చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి. అందులో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ రావడంతో అనసూయ వాటిని తిరష్కరించింది. స్పెషల్ సాంగ్స్ కి నో చెప్పిన అనసూయ త్వరలోనే ఓ సినిమాతో వెండితరపై హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాకి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.

అనసూయ హీరోయిన్ గా నటించనున్న సినిమా ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్ అని, ఈ సినిమా ద్వారా రవికాంత్ పెరేపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడని ఇది వరకే తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘క్షణం’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. అడవి శేష్ హీరోగా నటించనున్న ఈ థ్రిల్లర్ సినిమా కోసం అనసూయ స్పెషల్ వర్క్ షాప్ కూడా చేస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2015 మార్చి నుంచి మొదలు కానుంది. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

Exit mobile version