“క్షీరసాగర మధనం” ట్రైలర్ విడుదల చేయనున్న శరత్ మరార్!

ksheera sagara madhanam 1

సాప్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం క్షీరసాగర మధనం. అయితే ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్ట్ 6 వ తేదీన థియేటర్ల లో విడుదల అయ్యేందుకు సిద్దం అవుతుంది. ఈ చిత్రాన్ని పలువురు సాప్ట్ వేర్ ఇంజినీర్స్ కలిసి సంయుక్తంగా ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత శరత్ మరార్ జులై 29 వ తేదీన రాత్రి 8:08 గంటలకు విడుదల చేయనున్నారు. మానవ సంబంధాల నేపథ్యం లో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం లో మానస్ నాగులపల్లి, బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ లు హీరో లుగా నటించగా, అక్షత సోనావనీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో ప్రదీప్ రుద్ర ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ, తమ చిత్రానికి మోరల్ గా ఎంతో సపోర్ట్ చేస్తున్న శరత్ మరార్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. ఆయన చేతుల మీదుగా క్షీర సాగర మథనం ట్రైలర్ రిలీజ్ అవుతుండడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆగస్టు 6న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

Exit mobile version