టాలీవుడ్‌లో క్రేజీ లైనప్‌తో KVN ప్రొడక్షన్స్..!

KVN

కన్నడ, తమిళ భాషల్లో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన KVN ప్రొడక్షన్స్, ఇప్పుడు టాలీవుడ్‌లో భారీ ప్రాజెక్టులతో అడుగుపెడుతోంది. తెలుగులో అగ్ర హీరోలు మరియు దర్శకులకు భారీ అడ్వాన్సులు చెల్లించి, రాబోయే కొన్నేళ్ల పాటు క్రేజీ సినిమాలను లైన్లో పెట్టింది.

మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాతో ఈ సంస్థ తెలుగు చిత్రసీమలోకి అధికారికంగా ప్రవేశించనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం చిరంజీవి, బాబీలకు ఇప్పటికే భారీ అడ్వాన్సులు అందాయి. కేవలం వీరితోనే కాకుండా ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ మరియు విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు ఈ నిర్మాణ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, శౌర్యువ్ వంటి క్రేజీ దర్శకులు కూడా KVN ప్రొడక్షన్స్ నుండి అడ్వాన్సులు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. అయితే, ఈ తెలుగు సినిమాల కంటే ముందుగా విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’, యశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ వంటి భారీ చిత్రాలను సజావుగా విడుదల చేసే బాధ్యత ఈ సంస్థపై ఉంది.

Exit mobile version