క్రియేటివ్ డైరెక్టర్ తో లేడీ సూపర్ స్టార్ ?

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి నయనతార తో సినిమా చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. అరుంధతి తరహాలో ఒక లేడి ఓరియంటెడ్ సబ్జెక్టు తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. నయనతార కు కృష్ణ వంశి చెప్పిన పాయింట్ నచ్చిందని సమాచారం. త్వరలో పూర్తి వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.

కృష్ణ వంశి ఈ మద్య తీసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కానప్పటికీ గతంలో ఆయన తీసిన సినిమాలు చాలా మందిని ఆలోచింపజేసాయి. ఎన్నో మంచి చిత్రాలు తీసిన కృష్ణ వంశీతో సినిమా చెయ్యడానికి చాలా మంది నటులు ముందు ఉంటారు. నయనతార తో కృష్ణ వంశి సినిమా గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మంచి కథ నచ్చితే లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తానని నయనతార గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.

Exit mobile version