పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న మోస్ట్ క్రీజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడని, వెంకటేష్ – పవన్ కళ్యాణ్ పై వచ్చే కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారని ఇదివరకే తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో రైట్స్ ని లహరి మ్యూజిక్ వారు ఓ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు.
లహరి వారు గోపాల గోపాలతో పాటు కంబైన్ గా వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ ఆడియో రైట్స్ ని కూడా సొంతం చేసుకున్నారు. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ‘గోపాల గోపాల’లో వెంకటేష్ ఓ మిడిల్ క్లాస్ కామన్ మాన్ లాగా కనిపిస్తుంటే, పవన్ కళ్యాణ్ శ్రీ కృష్ణుడుగా కనిపించనున్నాడు. వెంకటేష్ కి జోడీగా శ్రియ శరన్ నటిస్తున్న ఈ చీనెమాకి కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్నాడు. శరత్ మరార్ – డి. సురేష్ బాబు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
