ఈ ఏడాది ఆల్రెడీ సంక్రాంతి సినిమాల హంగామా మొదలైంది. డే 1 తోనే భారీ ఓపెనింగ్స్ ని సినిమాలు అందుకున్నాయి. అయితే ఈ ఏడాది లానే గత ఏడాది కూడా తెలుగు సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయ్యిన సినిమాలు ఉన్నాయి. మరి ఆ చిత్రాల్లో నట సింహం బాలయ్య హీరోగా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రం “డాకు మహారాజ్” కూడా ఒకటి.
ఇది బాలయ్య వెర్షన్ జైలర్ రేంజ్ లో ప్రొజెక్ట్ అయ్యింది. ఇక జైలర్ లో అనిరుద్ డ్యూటీ ఎలాగో డాకు మహారాజ్ కి థమన్ మాస్ డ్యూటీ అంతకు మించి హైలైట్ అయ్యి వైరల్ అయ్యింది. అక్కడ నుంచి డాకు మహారాజ్ ఓఎస్టీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తూ వచ్చారు. కానీ థమన్ దాన్ని ఇప్పుడు వరకు విడుదల చేయలేదు. కానీ ఫైనల్ గా ఈ సినిమా కొత్త అప్డేట్ అందించాడు. డాకు మహారాజ్ ఓఎస్టీని ఈ జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసాడు. సో అప్పుడు వరకు బాలయ్య అభిమానులు ఎదురు చూడాల్సిందే.
J-A-N-2-6-T-H #DaakuOST ????????????????????
LETS SET ???? ON F-I-R-E @dirbobby https://t.co/TO8aqHWhzd
— thaman S (@MusicThaman) January 12, 2026
