వేసవి చివరిలో మహేష్ బాబు – కొరటాల శివ సినిమా

Mahesh-Babu-Koratala-Shiva
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. వేసవి ప్రారంభ సమయానికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. వేసవి చివరిలో సినిమా విడుదలవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

‘మిర్చి’ సినిమాతో కొరటాల శివ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కూడా ‘మిర్చి’ తరహాలో విజయం సాధించాలని కోరుకుంటున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.

Exit mobile version