లేటెస్ట్ : ప్రమోషన్స్ షురూ చేసిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టీమ్


అల్లరి నరేష్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా మల్లి అంకం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆ ఒక్కటీ అడక్కు. ఈ మూవీని రాజీవ్ చిలకా గ్రాండ్ గా నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఒక సాంగ్, టీజర్ తో అందరిలో మంచి ఆసక్తిని ఏర్పరిచిన ఈ మూవీ మే 3న ఆడియన్స్ ముందుకి రానుంది.

విషయం ఏమిటంటే, తాజాగా ఈమూవీ టీమ్ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో షురూ చేసింది. అందులో భాగంగా హీరో అల్లరి నరేష్ పలు మీడియా ఛానెల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. తమ టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డ ఈమూవీ మంచి విజయం అందుకుంటుందని, అలానే చాలా గ్యాప్ తరువాత తాను చేస్తున్న ఈ కామెడీ మూవీ తనకు మరింత మంచి పేరు తెస్తుందని నరేష్ అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version