‘సాహో’ కూడా వాయిదాపడుతుందా ?

Saaho3

రూ.300 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ వాయిదాపడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. మొదట ఈ సినిమాను ఆగష్టు 15న విడుదలచేయాలని భావించిన నిర్మాతలు ఇప్పుడు ఆగష్టు 30కి వాయిదావేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఆగష్టు 2న విడుదలకావాల్సిన శర్వానంద్ చిత్రం ‘రణరంగం’ పనుల్లో జాప్యం కారణంగా ఆగష్టు 15కి వాయిదాపడింది. శర్వానంద్, ‘సాహో’ నిర్మాతలకు నడుమ మంచి స్నేహపూర్వక సంబంధం ఉంది. ఇద్దరూ ఒకేరోజు సినిమాలను రిలీజ్ చేసుకుని ఓపెనింగ్స్ దెబ్బతీసుకోరు. కాబట్టి ‘రణరంగం’ విడుదలవుతున్న ఆగష్టు 15న ‘సాహో’ చాలావరకు రిలీజ్ కాదు. కనుక వాయిదా వార్తలు నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇంకొద్దిసేపట్లో నిర్మాతలు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలున్నాయి.

Exit mobile version