ఇన్నేళ్ల తెలుగు సినీ ప్రస్థానంలో ఎంతోమంది వెటరన్ నటీనటులు తెలుగు సినిమా వద్ద తమదైన ముద్ర వేసుకున్నారు. అలా తెలుగు సినిమా దగ్గర మంచి ఆదరణ అందుకున్న ప్రముఖ నటుల్లో సీనియర్ నటి షావుకారు జానకి కూడా ఒకరు. 1950 లో షావుకారు చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆమె తన మొదటి సినిమా పేరుతోనే ఇన్నేళ్ల వరకు తెలుగు సినిమా వద్ద వెలుగొందారు.
ఇలా మొత్తం 400 పైచిలుకు చిత్రాల్లో నటించిన వారు తమ 94వ ఏట తుదిశ్వాస విడిచారు అని నిర్ధారణ అయ్యింది. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నేడు ఆమె చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దాదాపు 70 ఏళ్ళు నటిగా ఆమె కనిపించారు. చివరిగా అన్నీ మంచి శకునములే సినిమాలో కనిపించారు. మరి వారు లేని లోటు తెలుగు సినిమా దగ్గర పూడ్చలేనిది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది.
