లేటెస్ట్ బజ్.. యశ్ ‘టాక్సిక్’కి ఓటిటి పార్ట్నర్ దొరికేసారా?

Toxic-Movie

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా అలాగే రుక్మిణి వసంత్ లు ఫీమేల్ లీడ్స్ తో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రమే ‘టాక్సిక్’. ఎన్నో అంచనాలు నడుమ విడుదల అయ్యిన ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ సాధించింది.

అయితే టాక్ బాగా లేకపోయే సరికి రెండో రోజు నుంచే భారీగా డ్రాప్ అయ్యింది. అలాగే ఈ సినిమాకి ఇంకా ఓటిటి, శాటిలైట్ డీల్స్ కూడా జరగకుండానే థియేటర్స్ లోకి కూడా వచ్చిందని తెలిసిందే. మేకర్స్ చెబుతున్న భారీ ధరలకు ఏ ఓటిటి సంస్థ ముందు రాలేదు అన్నట్టు రూమర్స్ వినిపించాయి.

ఇలా చాలా కాలం వెయిటింగ్ తర్వాత ఎట్టకేలకి డీల్ లేకుండానే సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ కథనాలు ప్రకారం టాక్సిక్ కి ఓటిటి పార్ట్నర్ లాక్ అయినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని జీ 5 వారు సొంతం చేసుకున్నారట. మొత్తం అన్ని భాషల్లో కూడా వీరే కొనుగోలు చేసినట్టుగా టాక్. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version