ఈ ఏడాది హాలీవుడ్ సినిమా వద్ద సంచలనం సృష్టించిన హిట్ చిత్రాల్లో కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సినిమా “మైఖేల్” కూడా ఒకటి. మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆడియెన్స్ ఎంతగానో అలరించి 1 బిలియన్ డాలర్స్ కి పైగా రాబట్టింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
ఈ సినిమా హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఇవాళ్టి నుంచి సినిమా అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా కేవలం రెండు భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఒరిజినల్ ఇంగ్లీష్ ఇంకా డబ్బింగ్ హిందీ లలో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సినిమా అప్పుడు ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు చూడొచ్చు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఆంటోనీ తెరకెక్కించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
